కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లతో ఒరిగింది ఏమీ లేదు

– బీజేపీ, టీడీపీలు డ్రామాలాడుతున్నాయి
– నాలుగేళ్లుగా చంద్రబాబు ఏం సాధించారు
– కేంద్రం నిధుల్లో రాయలసీమ వాట ఎంత ఇచ్చారో చెప్పాలి
– రాష్ట్ర విభజనకు..ప్రత్యేక హోదా రాకపోవడానికి బాబే కారణం
– ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం
వైయస్‌ఆర్‌ జిల్లా: నాలుగేళ్లలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లతో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, మరోపక్క రాష్ట్రంలో వస్తున ఆదాయాన్ని అవినీతిమయం చేసి చంద్రబాబు పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటు ఉందని చెబుతున్నారని, ఎవరన్ని మోసం చేయడానికి ఈ బడ్జెట్‌ అని ప్రశ్నించారు. గురువారం ఆయన వైయస్‌ఆర్‌ జిల్లాలో బడ్జెట్‌ కేటాయింపులపై మీడియాతో మాట్లాడారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టిసీమ వల్ల వైయస్‌ఆర్‌ జిల్లా సస్యశ్యామలం అయ్యిందని టీడీపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిందని మీ వద్దే లెక్కలు ఉన్నాయన్నారు.  అసెంబ్లీలోనూ, మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయంలో 40 శాతం గ్రేత్‌ రేటు ఉంటుందని మత్స్యశాఖ గురించి చెబుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు మీరిచ్చిన డబ్బులు వడ్డీకీ కూడా సరిపోలేదన్నారు. బీసీ సబ్‌లో కోట్లు కేటాయిస్తున్నామంటున్నారని, ఖర్చు మాత్రం చేయడం లేదన్నారు. అన్ని అంకెల గారడీకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రూ.90 వేల కోట్లు ఉన్న అప్పును రూ.2 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ఖర్చులు పెరుగుతున్నాయే తప్ప, అసెట్స్‌లేవన్నారు. కడప జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. నాలుగేళ్ల బీజేపీ, టీడీపీలు కలిసి మెలిసి తిరిగి ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని విడిపోతున్నట్లు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపడుతున్నా..ఒక్క మీడియాలో కూడా రాయడం లేదన్నారు. రాయలసీమకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని తప్పుపట్టారు. హర్టికల్చర్, ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పి మాట తప్పారు. అన్నా క్యాంటీన్లకు తూతూమంత్రంగా రూ.200 కోట్లు కేటాయించారన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు నిద్రపోతున్నారా అని నిలదీశారు. రాయలసీమకు కొత్తగా ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఎమ్మెల్యేను సవాల్‌ చేస్తూ చంద్రబాబు వైయస్‌ఆర్‌ జిల్లాకు నీరిస్తామని చెప్పారు. ఇంతవరకు చుక్కనీరు రాలేదన్నారు. ఇది సమంజసం కాదన్నారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ సింగిల్‌ ఎజెండాగా పోరాటం చేస్తుందని, ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని టీడీపీ యూటర్న్‌ తీసుకుందన్నారు. రాష్ట్ర విభజన కారకుడైన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వ్యక్తిగత లాభం చూసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాలంలో నయా రాయపూర్‌ నిర్మించారన్నారు. రూ.12 వేల కోట్లు కేటాయించామని కేంద్రం చెబుతుంటే రాయలసీమ వాట ఎంత ఇచ్చావని ప్రశ్నించారు. 
 
Back to Top