హైదరాబాద్: అవినీతి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహాలంటే భయమా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. లోకేష్‌కు అడ్డదారిలో మంత్రి పదవి కట్టబెట్టారని, ఆయన మంత్రి అయ్యాక పంచాయతీ, గ్రామీణాభివృద్ధి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. గాంధీజీ సిద్ధాంతాలు చంద్రబాబుకు పనికి రావని, వీధి వీధికీ బెల్టు షాపు ఏర్పాటు చేశారని మండిపడ్డారు.