చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు అన్యాయం..ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి..టీడీపీ అవినీతిపై పవన్‌కు ప్రశ్నించడం చేతగాదా...విజయవాడః గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం అవినీతి,అక్రమాలపై వైయస్‌ఆర్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ అరాచకపాలనపై పవన్‌కల్యాణ్‌కు ప్రశ్నించడం చేతగావడం లేదని విమర్శించారు. ఉన్నత ఆశయాలతో పార్టీని స్థాపించి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైయస్ జగన్ సామర్థ్యం గురించి మాట్లాడటం అవివేకమన్నారు. గత నాలుగున్నరేళ్లుగా కరువు, చేనేత కార్మికుల సమస్యలు,దళితుల మీద దాడులు, రాజధానిలో భూ కబ్జాలపై వైయస్‌ఆర్‌సీపీ చేసిన పోరాటాలు జ్ఞాపకం లేదా అని పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు.
కుంభకర్ణుడైనా సంవత్సరంలో ఆరు నెలలే నిద్రపోతాడు. ఏకంగా నాలుగున్నర సంవత్సరాలు పాటు నిద్రపోయి నేడు మమల్ని ప్రశ్నిస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులైన మాజీ సీఎస్‌లు చంద్రబాబు లూటీ గురించి ప్రశ్నిస్తే వాటి గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుతో అంటకాగి అధికారంలోకి తీసుకొచ్చిన పవన్‌కు అవినీతిలో భాగం ఉందన్నారు. చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ అవినీతి ఎందుకు నిలదీయవు అని సూటీగా ప్రశ్నిస్తున్నామన్నారు. టీడీపీ ప్రజావ్యతిరేక కార్యకలాపాలపై ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాలరాస్తూ వైయస్‌ఆర్‌సీపీ పార్టీని అణచివేస్తామని హత్యా రాజకీయాలు చేసినా పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు విశ్వసనీయత,విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ప్రచారంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను తుక్కుతుక్కుగా ఓడించండి అని మాట్లాడటం సిగ్గుచర్య అన్నారు. ఏపీలో అదేమాట చెప్పగలవా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఏపీలో రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలకు బుద్ధిచెబుతారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎంత ఖర్చుచేశారో చెప్పాలన్నారు. 50 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు చేశారన్నారు. గిరిజన ఉపప్రణాళికలో నిధులు ఖర్చుచేయకుండా పక్కదారి పట్టించారని విమర్శించారు. చంద్రబాబు నియమించిన ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ నేడు సొంత ఎన్నికల్లో గెలవడం చేతకాదు గాని, తెలంగాణలో డబ్బులుతో అడ్డంగా దొరికి పోయారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ,ఎస్టీ జౌత్సహిక పారిశ్రామిక వేత్తలకు కారులు కొనుగోలులో రూ. 500 కోట్లు కుంభకోణం జరిగిందని, అదే డబ్బు తెలంగాణలో జూపూడి పంపిణీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాను నిధులు పక్కదారి పట్టించి తెలంగాణలో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు గెలిపించడానికి వాడుతున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా నియమించిన వ్యక్తులను రాజకీయాలకు వాడుకుంటూ పార్టీపరంగా దిగజార్చి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు,టీడీపీ మంత్రి దళితులకు అవమానించే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు. ‘ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా.. ఎస్సీలకు తెలివిలేదు. దళితులు శుభ్రంగా ఉండరు.. సక్రమంగా చదువుకోరు.. అందుకే అభివృద్ధి చెందరు అని గతంలో అవమానాలు చేశారన్నారు. దళితులపై మీ ప్రేమ ఇదేనా..అని ప్రశ్నించారు. కమీషన్లు,పర్సంటేజీలు తప్ప దళితుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నాడు కృషిచేయలేదన్నారు. వైయస్‌ఆర్ కాలంలో ఏవిధంగా దళితులకు భూ పంపిణీ చేశారో గుర్తుచేసుకోవాలన్నారు. ఐదువిడతలుగా లక్షలాది ఎకరాలకు భూములను పంపిణీ చేశారన్నారు. టీడీపీ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదన్నారు. వైయస్‌ఆర్ దళితులకు ఏవిధంగా ఆర్థిక స్వావలంబన కలిగించారో వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా దళితులకు న్యాయం,మేలు చేస్తారని తెలిపారు.