అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌హైదరాబాద్‌:  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో మొదటి ర్యాంకు వచ్చిందని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని, ఏపీని అవినీతిలో నిలిపారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. ఎవరో ఇచ్చిన ర్యాంకులు కాదని, ప్రజల నుంచి ర్యాంకులు తెచ్చుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సురేష్‌ మీడియాతో మాట్లాడారు. 
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కేంద్రం చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గొప్పలు చెప్పుకునేందుకు రెడీ అయ్యిందని మండిపడ్డారు. సెంట్రల్‌ ఫర్‌ మీడియా సర్వీస్‌ అనే రిపోర్టు ఉందన్నారు. ట్రాన్స్‌ఫరెన్సీ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. ఈ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వల్ల ఆకాశం ఏమైనా బద్ధలవుతుందా అని ప్రశ్నించారు. గతంలో కూడా ఎన్నో ర్యాంకులు వచ్చాయని, ఏమైనా సాధించారా అని నిలదీశారు. పరిశ్రమలకు ఈ ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక విధానం రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల భూ సేకరణ జరిగిందని, ఇంకా 7 లక్షల ఎకరాల సేకరణ అవసరమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నిర్మాణ పరిపాలన తదితర అంశాలపై సరళీకృత వ్యాపార విధానంలో ర్యాంకింగ్‌లు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగిపోతోందని విమర్శించారు. అవినీతిలో కూడా రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని రిపోర్టు వచ్చిందన్నారు. ఆన్‌లైన్‌ సర్వేలు కూడా ఏపీలో అవినీతి పెరిగిందనే చెప్పాయని వివరించారు. ఈ నాలుగేళ్లలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వల్ల ఏపీకి ఎన్ని లక్షల పెట్టుబడులు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. 2014లో ఏపీకి రూ.2411 కోట్లు అన్నారు. 2015లో 4500 కోట్లు, 2016లో 11091 కోట్లు, 2017లో రూ.4500 కోట్లు, 2018లో రూ.1000 కోట్లు..మొత్తంగా అన్ని కలిపితే రూ.25000 కోట్లు మించి పెట్టుబడులు రాలేదన్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు భాగస్వామ్య సదస్సుల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని , అవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. పార్లమెంట్‌ సాక్షిగా మీరిచ్చిన రిపోర్టులకు, కేంద్రం ఇచ్చిన రిపోర్టులకు ఎక్కడా పోలిక లేదన్నారు. రాష్ట్రం స్థూల ఉత్పత్తి దేశంలోని స్థూల ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉందని తండ్రి, కొడుకులు ప్రకటనలు ఇస్తూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో అవినీతిలో మొదటి స్థానంలో నిలిపారని, ఏయిడ్స్‌లో మొదటి స్థానం, దేశంలోని ధనిక సీఎంగా చంద్రబాబు ఉన్నారన్నారు. రైతుల అప్పుల్లో మొదటి స్థానం, మహిళల అఘాయిత్యాలల్లో నాలుగో స్థానం, దళితుల్లో దాడుల్లో నాలుగో స్థానం, దోపిడీ, దొంగతనాల్లో ఆరుస్థానం, 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయని ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వానిదే అన్నారు. అప్పుల్లో కూడా మొదటి స్థానంలో ఉన్నారన్నారు. బూటకపు ఉద్యోగాలు, పెట్టుబడులు, అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఇసుక, మట్టి, రాజధాని, గుడి భూముల పేరుతో దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు, ఆగ్రిగోల్డు ఆస్తులు కొట్టేయాలనే కుట్రలు మీవి కావా అన్నారు. ప్రయోజనం లేని విదేశీ పర్యటనలతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 
 
Back to Top