పట్టిసీమలో వందల కోట్ల దుర్వినియోగం


–ప్రజా పద్దుల కమిటీకి విశ్వసనీయత ఉంది
– ఈ కమిటీలో వైయస్‌ఆర్‌సీపీతో పాటు  ఇతర పార్టీలు ఉంటాయి
విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టులో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ఆ విషయాలను కాంగ్‌నివేదికలో పొందుపరిచిందని తెలిపారు. ప్రజా పద్దుల కమిటీకి విశ్వసనీయత ఉందని, ఈ విషయాన్ని టీడీపీ మంత్రులు తెలుసుకోవాలని సూచించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధితో కలిసి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుటి నుంచి డీపీఆర్‌ ఏవిధంగా తయారు చేశారో చెప్పారన్నారు. పట్టిసీమకు వాడుతున్న మోటర్ల గురించి చంద్రబాబు, ఇరిగేషన్‌ అధికారులే చెప్పారన్నారు. పట్టిసీమ కాలపరిమితి మూడేళ్లు మాత్రమే అని చెప్పారన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు డీపీఆర్‌ తయారు చేశారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో వందలాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని కాగ్‌ నివేదిక చెప్పిందన్నారు. ఎక్సైజ్‌ సుంకం ఉందని 2004లో కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. పట్టిసీమకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేసే విషయంలో కాంట్రాక్టర్లకు ఎక్సైజ్‌ సుంకాన్ని చెల్లించారన్నారు. పంప్‌ హౌస్‌కు సంప్రదాయక సామాగ్రికి అదనంగా వంద కోట్ల దుర్వినియోగం చేశారన్నారు. పంప్‌ హౌస్‌ కూడా 12 నెలల్లో పూర్తి చేశారన్నారు. ప్రజాపద్దుల కమిటీలో వైయస్‌ఆర్‌సీపీ ఒక్కటే ఉండదని, మిగతా పార్టీలు కూడా ఉంటాయన్నారు. జపాన్‌ గురించి గొప్పగా చెప్పే చంద్రబాబు అక్కడ తప్పు చేస్తే వేసే శిక్షలు మీరు అనుభవిస్తారా అని ప్రశ్నించారు. ఈ రోజుకు రూ.3.75 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారన్నారు. వైయస్‌ జగన్‌కు పేరొస్తుందని భయపడి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో అడ్డుపడుతున్న టీఆర్‌ఎస్‌తో ఎందుకు మద్దతు కూడగట్టలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
 
Back to Top