వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల వాకౌట్‌

నరసరావుపేట: ఎంపీటీసీ సభ్యులకు తెలియజేయకుండా  గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపడుతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ప్రశ్నించారు. మండలంలో రహస్యంగా చేపట్టిన పనులను ఎజెండాలో పెట్టడాన్ని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశంలో సాధారణ నిధులతో చేపట్టబోయే ఆరు పనులు గురించి చర్చించారు. ఎంపీటీసీల నుంచి ప్రతిపాదనలు లేకుండా  ఎజెండాలో అయా పనులను ఎలా చేరుస్తారని ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి నిరసనగా మంగళవారం జరిగిన మండల మీట్‌ నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు వాకౌట్‌ చేశారు.

మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీపీ కె.ప్రభాకరరావు అద్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంబం కాగానే ఎజెండాలోని అంశాల గురించి మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు యన్నం రామిరెడ్డి ప్రశ్నించారు. సాధారణ నిదులతో చేపట్టబోయే పనులు గురించి ఎంపీటీసీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఎజెండాలో ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇప్పటికే అంచనాలు సిద్దమయినట్టు ఎంపీడీవో బి.బాలునాయక్‌ తెలిపారు. గ్రామాల్లో చేసే పనుల గురించి ఎంపీటీసీల నుంచి ప్రతిపాదనలు తీసుకోకుండా ఏ విధంగా అంచనాలు సిద్దంచేస్తారని వైయస్సార్‌ సిపి ఎంపీటీసీలు వై.వెంకటప్పారెడ్డి, వెన్నామాధవి,  జెడ్పీటీసీ షేక్‌ నూరల్‌ అక్తాబ్‌ ప్రశ్నించారు. పనులకు సంభందించిన పూర్తి వివరాలు కూడా ఎజెండాలో లేవని తెలిపారు.  దీనిపై పంచాయతీ రాజ్‌ ఏఈ హరినాద్, ఎంపీడీవోలు చర్చలు జరిపారు.  ఎంపీటీసీలు ప్రతిపాదనలు ఇస్తే వాటిని కూడా పరిశీలిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే అంచనలు తయారు చేసి ఎజెండాలో పెట్టిన తరువాత ఇప్పుడు ప్రతిపాదనలు ఇచ్చి ఉపయోగం ఏమిటని నిలదీశారు. 
 
Back to Top