వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఎంపికపై హర్షం

లేపాక్షి: అనంత‌పురం జిల్లా హిందూపురం పట్టణంనకు చెందిన ప్రశాంత్‌గౌడ్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం పట్ల లేపాక్షి మండల కన్వీనర్‌ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్‌ కమిటి స‌భ్యులు నారాయణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు. ప్రశాంత గౌడ్‌ పార్టీ బలోపేతానికి, పార్టీ అభివృద్దికి కృషిచేస్తారని, భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు.

Back to Top