తుఫాను బాధిత ప్రాంతాల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పర్యటన

శ్రీకాకుళం:  శ్రీకాకుళం, విజయనగరం
జిల్లాలోలని తిత్లీ తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో, వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు నేడు
రేపు పర్యటించనున్నారు. శుక్రవారం నాడు ఇఛ్చాపురం, పలాస నియోజకవర్గంలోని తుఫాను
బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాద రావు తెలిపారు.
శనివారం నాడు నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లోని తుఫాన బాధిత ప్రాంతాల్లో
పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో బాధితులకు అండగా నిలబడటంతోపాటు ,
తుఫాన తీవ్రతన అంచనా వేయనున్నారు.హైటెక్ పాలన అంటూ ప్రచారం చేసుకునే ప్రభుత్వం
తుఫాను తీవ్రతను అంచనా వేసి ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు.
మత్స్యకారులు విపరీతంగా నష్టోయారనీ, భారీగా ఆస్తినష్టం సంభవించిందని, పడవలు, వలలు
దారుణంగా కొట్టుకుపోయాయి, దెబ్బతిన్నాయని ఆయన తుఫాను తీవ్రతను వివరించారు. వరి,
జీడిమామిడి, కొబ్బరి, మామిడి రైతులు దారుణంగా నష్టపోయారనీ,పొట్ట దశలో ఉన్న వరి
తీవ్రంగా దెబ్బతింది, దిగుబడి వచ్చే అవకాశాల్లేవన్నారు.

గతంలో సంభవించిన హుద్‌ హుద్‌ సహాయమే ఇంకా
రైతులకు అందలేదనీ, ముఖ్యమంత్రి ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో
పరిస్థితులకు సంబంధం ఉండటంలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికీ తుపాను బాధిత ప్రాంతాల్లో
సహాయక చర్యల్లేవు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్మలో  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లేవు, సహాయక బృందాలు కనిపించడంలేదు: మూడురోజులుగా తుపాను హెచ్చరికలు
ఉన్నా, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించడంలేదన ప్రభుత్వ తీరును
గర్హించారు.

ఇంకా చాలా ప్రాంతాల్లో కరెంటు
పునరుద్ధరణ లేదనీ, ముఖ్యమంత్రి పబ్లిసిటీ తప్ప, బాధితులకు సహాయం అందడంలేదనీ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. విపత్తుల్లో
ఉన్నా ఆదుకోరని ప్రజలకు రూఢి అయ్యింది, అత్యవసర పనుల్లో వినియోగించే వారికి
చెల్లింపులు కూడా సరిగ్గా చేయక ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడానికి ఇష్టంపడ్డంలేదు.

తాజా వీడియోలు

Back to Top