చంద్రబాబు ప్రభుత్వం దళిత ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా?

పామర్రు: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే ఐజయ్యపై నిండు సభలో సీఎం చంద్రబాబు అవమానకర రీతిలో ప్రవర్తించిన తీరుని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలేఅనీల్‌కుమార్‌ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే గాని అవమానకంగా ఐజయ్య మాట్లాడుతున్న మైక్‌ను కట్‌ చేయటం ప్రసంగాన్ని అడ్డుకోవడం అనేది పిరికి పందల చర్య అన్నారు. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఐజయ్య సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంతే కాని వక్రబుద్దితో ప్రశ్నలను జీర్జించుకోలేక చంద్రబాబు అక్కసును ప్రదర్శించడం తన కుసమస్కారానికి నిదర్శనం అన్నారు. ఓ దళిత ఎమ్మెల్యేపై ఈ విధంగా అవమానకరంగా మాట్టాడిన చంద్రబాబుపై ఆ నియోజకవర్గంలోని దళిత నేతలు మాట్లాడక పోవడం బా«ధాకరం అన్నారు. మొదటి నుంచి చంద్రబాబుకు దళితులంటే చులకన భావం. దళితులు అందరూ కలిసి కట్టుగా ఉండి చంద్రబాబు దురహంకారాన్ని దించాలని పిలుపు నిచ్చారు. ఇటు వంటి దళితులను అవమాన కరం చేసే సంఘటనలు చరిత్రలో పునరావృతంకాకుండా దళితులు అందరూ కలిసి కట్టుగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. ఇప్పటి కైనా చంద్రబాబు సత్‌ బుద్ది కల్గి దళితుల పట్ల వక్రబుద్ది మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో భవిష్యత్‌లో దళిత జాతి మిమ్మల్ని క్షమించదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు మందా శ్రీనివాస్, ఎంఆర్‌పీఎస్‌ మండల అధ్యక్షులు రాజ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top