విజ‌య‌వాడ‌లో రిలే నిరాహార దీక్ష‌లు ప్రారంభం


విజ‌య‌వాడ‌: ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధనకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఇవాళ ఉద‌యం విజ‌య‌వాడ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రిలే నిరాహార దీక్ష‌లు ప్రారంభించారు. ఈ దీక్ష‌ల‌ను పార్టీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ‌సార‌ధి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాలుగేళ్లుగా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తుంద‌న్నారు. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఇదివ‌ర‌కు చెప్పిన‌ట్లుగా ఎంపీల‌తో రాజీనామాలు చేయించార‌న్నారు. అయితే చంద్ర‌బాబు పూట‌కో మాట మాట్లాడుతూ హోదాను కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌న్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల ఆకాంక్ష అని, హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని   అభిప్రాయపడ్డారు. హోదా కోసం తాము పోరాడుతుంటే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.  
 

తాజా వీడియోలు

Back to Top