మంత్రి సునీతకు వ్యతిరేకంగా నిరసనలుఅనంతపురం: మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సాక్షి కార్యాలయం వద్ద ఈ నెల 28వ తేదీ మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్‌ సృష్టించిన వీరంగాన్ని జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. పరిటాల సునీతకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు గోపాల్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు.

పెనుకొండలో నిరసన ర్యాలీ
పెనుకొండలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హిందూపురం ప్రెస్‌ క్లబ్‌ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 
 

తాజా వీడియోలు

Back to Top