మొగల్తూరులో వైయస్‌ఆర్‌సీపీ నేతల పర్యటన

పశ్చిమ గోదావరి: మొగల్తూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం పర్యటించారు. ఆనంద్‌ ఆక్వా ఫ్యాక్టరీలో విష వాయువులు లీక్‌ కావడంతో ఇటీవల ఐదుగురు కార్మికులు మృత్యువాత పడిన విషయం విధితమే. ఫ్యాక్టరీలోని ప్రమాద స్థలిని ఇవాళ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు తదితరులు పరిశీలించారు. ఫ్యాక్టరీ నుంచి గోంతేరు డ్రైన్‌కు కలిపిన పైప్‌లైన్‌ కూడా వీరు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పలకరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఈ ప్రమాదం జరిగిందని బాధితులు, గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ..30 టన్నుల ఉత్పత్తికి మాత్రమే ఆనంద్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్‌ చేసుకున్నారని తెలిపారు. అడ్డగోలుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం దారుణమన్నారు. వారం రోజుల్లో పైపులైన్లు తొలగించాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశిస్తే..యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలుబడుతున్న కలుషిత నీటిని గోంతేరు డ్రైన్‌లో వదులుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కనీసం పైపులు తొలగించే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేవని, వ్యవసాయానికి నీళ్లు లేవన్నారు. మత్స్యకారుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మంత్రి  అచ్చెన్నాయుడు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆక్వా ఘటనలో ఐదుగురి కార్మికుల మరణానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top