<br/>ఢిల్లీః రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను వైయస్‌ఆర్‌సీపీ నేతల బృందం కలిసింది. గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, సీనియర్ నేతలు కోరారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించిన తీరు సరిగా లేదని వైయస్ఆర్‌సీపీ నేతలు రాష్ట్రపతికి వివరించారు. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు కనీసం వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు వైయస్ఆర్‌సీపీ పైనే నింద వేసే ప్రయత్నం చేశారు. వైయస్ జగన్ జాగ్రత్త పడకపోయి ఉంటే ఆ రోజు ఆయన ప్రాణాలకే ముప్ఫు ఏర్పడేది. ఈ దాడి విషయంలో చంద్రబాబు కనీసం సానుభూతి కూడా తెలపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ తీరు సరిగా లేదు. పలు అనుమానాలకు తావిస్తోంది. అందుకే సీబీఐ చేత విచారణ చేయాలని పార్టీ నేతల బృందం రాష్ట్రపతిని కోరారు.