<br/>న్యూఢిల్లీ: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనను వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన వైయస్ఆర్‌సీపీ బృందం బుధవారం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. ఈ మేరకు దాడి ఘటనను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైయస్ జగన్‌పై జరిగింది మూమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్‌లో తేటతెల్లమైందన్నారు. ఇది ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జరిగిందనడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ విశాఖ ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌లో పని చేస్తున్నాడని, అది టీడీపీకి చెందిన వ్యక్తి చేతుల్లోనే ఉందనే విషయాన్నివెల్లడించారు. ఈ ఘటనపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.