అంధకారం పోవాలంటే అన్న రావాలి

వైయస్‌ జగన్‌తోనే ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు
మూడు వేల కిలోమీటర్లు విజయనగరంలో పూర్తి చేసుకోవడం సంతోషం

విజయనగరం: ప్రజల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను దేశమంతా చూస్తోందని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాదయాత్రలో పాల్గొన్న కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ రాజకీయ నేత చేయని దూరం పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ.. వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ.. ప్రజలకు భరోసా ఇస్తూ వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారన్నారు. విభజన తరువాత ఆంధ్రరాష్ట్రం వెనుకబడిపోయిందని, రాజన్న రాజ్యం వస్తేనే అభివృద్ధి చెందుతుందని, అది వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోనే సాధ్యమన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు ఉంటుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. 
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి ఘట్టం విజయనగరం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేలు జిల్లాలో పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీడీపీ అనేక అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టివేసిందన్నారు. ఆంధ్రరాష్ట్రానికి పట్టిన అంధకారాన్ని పారదోలాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. 
Back to Top