వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

ధర్మవరం: పట్టణంలోని లక్ష్మి చెన్నకేశవ పురానికి చెందిన రఫీ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, 27వ వార్డు ఇన్‌చార్జ్‌  మేడాపురం వెంకటేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొదుతున్న రఫీని పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని ఏం సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సరితాల భాష, కరీం, క్రిష్ణారెడ్డి, వేమారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్శింహులు, కుళ్లాయప్ప, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top