ఢిల్లీకి వైయ‌స్ఆర్‌సీపీ బృందం


  న్యూఢిల్లీ : జననేత జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో గత గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.   ప్ర‌తిప‌క్ష నేత‌పై జ‌రిగిన దాడిపై రాష్ట్ర‌ప‌తి, కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ బృందం ఆదివారం ఢిల్లీ బ‌య‌లుదేరింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని కలిసి ఏపీలో తలెత్తిన శాంతి భద్రతల వైఫల్యాన్ని వారు వివరించనున్నారు. అత్యంత భద్రత ఉండే విశాఖ ఎయిర్‌పోర్టులో వైయ‌స్‌ జగన్‌పై గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు థర్డ్‌ పార్టీ విచారణ కోరనున్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించిన రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై వివాదాస్పదంగా వ్యవహరించారు. దాంతో హత్యాయత్నం ఘటనపై ఠాకూర్‌ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌పై తనకు నమ్మకం లేదంటూ వైయ‌స్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై ఏపీ అధికారులతో కాకుండా థర్డ్‌ పార్టీతో విచారణ చేయించాలని పార్టీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలపనున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ మాజీ ఎంపీలు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ..వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిని అంతమొందించటానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండతోనే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని అన్నారు. హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించాలని చూస్తున్నట్లు తెలిపారు.  వైయ‌స్ జగన్‌ హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం చంద్రబాబు ఢిల్లీ వచ్చారని చెప్పారు. 

 

Back to Top