జ‌గ‌న‌న్న‌కు అండగా నిలబ‌డ‌దాం

  

సాలూరు: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా సాగుతున్న అవినీతి పాలనను అంతమొందించేందుకే వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్నారని, ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ‌దామ‌ని పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. మెంటాడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయేది మన పాలనేనని దీనికి సంకేతమే ఒక్క మెంటాడ మండలంలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సారధ్యంలో 14 గ్రామాలనుంచి 700 మంది టీడీపీ, కాంగ్రెస్‌ తాజా, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు చేరికని స్పష్టం చేశారు. దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి ఒకడుగు ముందుకు వేస్తే, జగన్‌ రెండడుగులు ముందుకేసి పరిపాలన సాగిస్తారని తెలిపారు. ఒక్క తప్పు చేయకపోయినా, ఆయనను అనేక ఇబ్బందులు పెట్టినా, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి, ప్రజల తరఫున తక్కు వ వ్యవధిలోనే ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి, ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపారని చెప్పారు. జగనన్న భారతదేశ రాజకీయాలలో మండే సూర్యగోళం లాంటివారని, ఇప్పటివరకూ రాజకీయాలకు వచ్చిన ఏ నాయకుడికీ లేనన్ని కష్టాలు పెట్టినప్పటికీ ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ప్రజా జీవితమే తన ఊపిరిగా రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చంద్రబాబు పాలనకు అంతిమ యాత్ర కాగలదని చెప్పారు. స‌మావేశంలో ఎమ్మెల్యే  రాజన్నదొర,  

వైయ‌స్ఆర్‌సీపీలో భారీగా చేరికలు
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 14 గ్రామాల నుంచి సుమారు 700 మంది వివిధ స్థాయి టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి భూమన కరుణాకరరెడ్డి, పీడిక రాజన్నదొర, మజ్జి శ్రీనివాసరావు (చినశ్రీను), తదితరులు కండువాలు వేసి స్వాగతం పలికారు.
 


Back to Top