ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ గళం..!

ఏపీః ప్రత్యేకహోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ రిలేదీక్షలు, ధర్నాలు, ర్యాలీలు , కొవ్వొత్తుల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి  స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని నేతలు, కార్యకర్తలు నినదిస్తున్నారు. ప్రధాని చేత ప్రత్యేక హోదా ప్రకటన ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్..!
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని ప్రస్తుత ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని వైఎస్సార్సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ప్రత్యేహోదా తీసుకురావడంలో టీడీపీ తోకముడిచినందునే వైఎస్ జగన్ ...ఆబాధ్యతను తనపై వేసుకొని ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడారన్నారు. ఐనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. 

రామకృష్ణారెడ్డి..
రైతులు, కూలీలు, కౌలురైతుల కన్నీటి పునాదులపై చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు ప్రధానిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.  ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రాజధాని నిర్మాణం జరగలేదని ఆయన ఎద్దేవా చేశారు. 

భూమన కరుణాకర్ రెడ్డి...
రాజధాని నిర్మాణం పేరిట ప్రచారం కోసం చంద్రబాబు దేవుళ్లను కూడా వదలడం లేదని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు సర్కార్ కు... ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. హడావుడిగా చేపడుతున్న రాజధాని నిర్మాణాలు.... భవిష్యత్ లో పేకమేడల్లా కూలిపోయే ప్రమాదం ఉందని భూమన ఆందోళన వ్యక్తం చేశారు.

తమ్మినేని సీతారాం..
చంద్రబాబు రాష్ట్రాన్ని విదేశీయులకు దోచిపెట్టి  బిక్షం ఎత్తుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.  రైతులు భూములు ఇవ్వమన్నా నిర్ధాక్షిణంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబుకన్నా బ్రిటీష్ వాళ్లే నయమన్నారు. 
Back to Top