ఈవోఆర్‌డీపై కలెక్టర్‌కు వైయస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

బి.కొత్తకోట: బి.కొత్తకోట మండల ఈవోఆర్‌డీ గంగయ్యపై  వైయస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు చిత్తూరు వెళ్లి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బి.కొత్తకోట ఎంపీటీసీ ఈశ్వర్‌రెడ్డి పట్ల ఈవోఆర్‌డీ నిర్లక్ష్యంగా వ్యహరించి దూషించారని నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీపీ ఖలీల్, వైస్‌ఎంపీపీ ఈశ్వరమ్మ, మాజీ జెడ్పీటీసీ ప్రదీప్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు బావాజాన్, ఎంపీటీసీలు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జెడ్పీటీసీ ఈవో పెంచల కిషోర్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావులను కలిసి గంగయ్య తీరుపై ఫిర్యాదులు అందించారు. దీనిపై వారు మాట్లాడుతూ... సంఘటనపై విచారణ నిర్వహిస్తామని హమీ ఇచ్చారని తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top