నగరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సంబరాలు

చిత్తూరు : హైకోర్టు తీర్పు నేపథ్యంలో నగరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోరోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.  నియోజకవర్గమంతటా నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి... మిఠాయిలు పంచుకున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top