జననేతను ప్రజలకు దూరం చేయాలని కుట్రలు


విజయనగరం: జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలకు దూరం చేయాలన్న కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజన్న దొర మాట్లాడారు. మన నాయకుడు మనకోసం వస్తున్నాడని, నవరత్నాలు తెస్తున్నారని చెప్పారు. టీడీపీ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆ సమస్యలను అర్థం చేసుకొని, మన కన్నీళ్లు తుడిచేందుకు వస్తున్న మన నాయకుడిని మన వద్దకు రాకుండా, ప్రజలకు దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. విశాఖ విమానాశ్రయంలో జననేతపై హత్యాయత్నం చేసిందంటే ఈ ప్రభుత్వం సామాన్యులకు రక్షణ ఇస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు 176 జీవోను విడుదల చేసి సీబీఐ రాకుండా ఆంక్షలు విధించారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో సీబీఐ విచారణ చేయించి సచ్చిలుడిగా బయటకు వచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి బంగాళఖాతంలో పడేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 
 
Back to Top