కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారు

ప్రకాశం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, సాధిస్తామని టీడీపీ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారని ప్రకాశం జిల్లా చీరల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త యడం బాలాజీ ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీల మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చీరాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో యడం బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రజా సంకల్పయాత్రకు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌ తీసుకువస్తారని దీమా వ్యక్తం చేశారు. మొదటి నుంచి వైయస్‌ జగన్‌ ఒక్కరే హోదా ఉద్యమం చేస్తున్నారని, చంద్రబాబు తన మంత్రులతో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్డీయేలోనే కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌ సీపీ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలంతా మద్దతుగా నిలవాలన్నారు. 
Back to Top