<br/>హైదరాబాద్: సీబీఐని గత కొంతకాలంగా భ్రష్టుపట్టించారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సీబీఐ తన మనుషులనే అరెస్టు చేసే దుస్థితికి వచ్చిందన్నారు. ఎల్లో మీడియాకు నచ్చితే నంది..నచ్చకపోతే పంది అని రాస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ నాడు కాంగ్రెస్‌ను ఎదురించారని ఆ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సీబీ‘ఐ’ అని రాశారని, ఇవాళ చంద్రబాబుకు సంబంధించిన మనుషులపై విచారణ చేపడితే ఛీబీఐ అని వార్తలు రాయడం ఎంతవరకు న్యాయమన్నారు.