అండగా ఉండి అన్నను రక్షించుకుంటాం




చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు
దేవుడి దీవెన, ప్రజల ఆశీస్సులే జననేతను కాపాడాయి

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యాయత్నానికి తెరతీశారని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ప్రజాదరణ చూసి చంద్రబాబుకు నిద్రపట్టక ఏ విధంగానైనా భౌతికంగా అడ్డుతొలగించాలనే దురుద్దేశంతో హత్యాయత్నానికి ఒడిగట్టారన్నారు. కానీ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో జననేత ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దీవెనలే తోడుగా వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు కూడా కుట్ర రాజకీయాల్లో భాగమేనని ఆమె అన్నారు. వైయస్‌ జగన్‌ పేరు వింటేనే చంద్రబాబు వెన్నులో వణుకుపడుతుందని, అందుకే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను మరిచి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టారన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కూడి చంద్రబాబే తన ఓటమిని అంగీకరించారన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలకు ధైర్యం చెబుతూ.. అండగా ఉంటానని భరోసానిస్తూ వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా రక్షణగా ఉండి ముఖ్యమంత్రిని చేసుకుంటారన్నారు. 
 
Back to Top