ఆంధ్రుల పాలిట ఆశాకిరణం వైయస్‌ జగన్‌..

విశాఖ - నాలుగేళ్ల చంద్రబాబు దుష్ట పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికి వచ్చిన ఆశాకిరణం వైయస్‌ జగన్‌ అని వరుదు కల్యాణి అన్నారు. విశాఖ జిల్లా చోడవరం  బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అన్నివర్గాలను మోసం చేశారని విమర్శించారు.  మహిళలు, నిరుద్యోగులు,యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కష్టాలతో రైతు తలదించుకుని బతుకుతున్నాడని, జగనన్న సీఎం అయితే ప్రతి  రైతు గర్వంగా తలెత్తుకుని బతుకుతారన్నారు. కరువును జయించడానికి రెయిన్‌ గన్లను ఏర్పాటుచేస్తానన్న చంద్రబాబు ఆ గన్‌లను మీ మనవడికి ఇచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లగా కరువును జయించానని చంద్రబాబు చెప్పుతున్నాని అయినా ప్రతి చోటా కరువు కనిపిస్తూనే ఉందన్నారు.
Back to Top