చంద్రబాబూ..దిగజారుడు రాజకీయాలు తగవు..

పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు..
వైయస్‌ఆర్‌సీపీ నేత వర ప్రసాద్‌
ఢిల్లీః చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వరప్రసాద్‌ అన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగి గాయపడితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు సంస్కారహీనంగా మాట్లాడం పద్దతికాదన్నారు. హేళనగా, చులకనగా మాట్లాడటమే కాక, ప్రధాన ప్రతిపక్ష నేతను వాడూ,వీడూ అని సంబోధించడం రాజకీయ సంస్కారం లేని వ్యక్తి అని చంద్రబాబు నిరూపించుకున్నారన్నారు. హత్యాయత్నంపై విచారణ అనే మాట లేకుండా బురదజల్లేవిధంగా ఆరోపణలు గుప్పించడం చంద్రబాబు కుటిలబుద్ధికి నిదర్శనమన్నారు. డీజీపీ బాధ్యతను మరిచిపోయి టీడీపీ ప్రభుత్వానికి వంతపాడటం దురదృష్టకరమన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడవలసిన ఉన్నత స్థాయి వ్యక్తి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం బాధాకరమన్నారు.డీజీపీతో అలా మాట్లాడించి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. యథా రాజా..!తథా ప్రజా..! అన్నట్లుగా చంద్రబాబు నాయుడులాగే వారి మంత్రులు కూడా అలాగే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.‘మేం హత్యాయత్నం చేస్తే భారీస్థాయిలో చేసేవాళ్లం’ అంటూ ఒక టీడీపీ మంత్రి ఒక రౌడీలా మాట్లాడుతున్నారన్నారు. అలాగే ఒక టీడీపీ ఎంపీ మాట్లాడుతూ ‘ముక్కలు ముక్కలు చేసేవాళ్లం’ అంటూ గూండాల  వ్యాఖ్యలు చేయడం నీచమైన సంస్కృతికి టీడీపీ పాల్పడుతుందన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ‘ కుటుంబసభ్యులే హత్యయత్నానికి కారకులని’ చెబుతున్నారని, అలా చెప్పడానికి ఎలా నోరు వచ్చిందని ఖండించారు. తండ్రి చనిపోయి వైయస్‌ జగన్‌ కుటుంబం బాధల్లో ఉందని, అలాంటి కుటుంబసభ్యులపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్‌ యాజమాని టీడీపీ నేత అనే సంగతి ఎందుకు చెప్పడంలేదు..నిందితుడు శ్రీనివాస్‌ టీడీపీ నుంచి సంక్షేమపథకాలు పొందడానే విషయం ఎందుకు బయటపెట్టడం లేని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం  వాస్తవాలు తొక్కిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తుందన్నారు.అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగినప్పుడు దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎంత హుందాగా ప్రవర్తించారనే విషయం గుర్తుచేశారు. స్వయంగా వైయస్‌ఆర్‌ ధర్నా చేసి న్యాయం కోరారన్నారు. వైయస్‌ఆర్‌ను చూసి చంద్రబాబు నాయుడు సంస్కారం నేర్చుకోవాలన్నారు.
Back to Top