పేదల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు..

శ్రీకాకుళంః నిజమైన ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులుగా వైయస్‌ఆర్‌సీలోకి చేరుతున్న ఇతర పార్టీ నాయకులను స్వాగతిస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ నేత  రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పేదల సంక్షేమాన్ని వదిలేసి భూస్వామ్యవర్గాలకు, కార్పొరేట్‌ వ్యక్తుల కొమ్ము కాయడానికే టీడీపీ ప్రభుత్వం అంకితమయ్యిందన్నారు.టీడీపీ పాలనలో అరాచక పాలనను సహించలేక టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్‌ నేతలు సైతం వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారన్నారు.రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందనే శుభసూచకం కలుగుతుందన్నారు.వైయస్‌ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.రాజమండ్రి శాసనసభ స్థానాన్ని వైయస్‌ జగన్‌ను గిప్ట్‌గా ఇస్తామని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top