‘తూర్పు’ స్వాగతం చరిత్రలో నిలుస్తుంది

కొవ్వూరు: రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు పలికే స్వాగతం చరిత్రలో నిలిచిపోతుందని పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం నాటి నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లా జిల్లాకు జనసందోహం పెరుగుతూ వస్తుందన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా చంద్రబాబు మోసాలే.. దోపిడీనే దర్శనమిస్తున్నాయన్నారు. ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. పశ్చిమ గోదావరిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతికి అంతేలేకుండా పోయిందని, 600ల వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి అమలు చేయలేదని ప్రజలు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏ సామాజికవర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జీపై స్వాగతం పలికేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారన్నారు. 
Back to Top