కష్టాలు తీర్చే నాయకుడు వైయస్‌ జగనే...

విజయనగరంః పార్వతీపురం డివిజన్‌గా రూపాంతరం చెందిన కూడా వెనుకబడి ఉందని వైయస్‌ఆర్‌సీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ  అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజ్‌ అన్నారు. పారిశ్రామికంగా వెనుకంజలో ఉందన్నారు.పార్వతీపురం డివిజన్‌లో డిగ్రీ కాలేజి ఒక్కటే ఉందని, మండలానికి ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారన్నారు.పారిశామ్రిక శిక్షణ కేంద్రాలను పెట్టి ఉద్యోగాలను అవకాశాలను కల్పిస్తామని వైయస్‌ జగన్‌ విద్యార్థులకు భరోసా ఇచ్చారని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారన్నారు.కష్టాలు తీర్చే నాయకుడు జగన్‌ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు. 


Back to Top