గిరిజనులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత

విజయనగరంః ఏ నాయకుడు కూడా మారుమూల ప్రాంతమైన సాలూరుకు పాదయాత్రగా రాలేదని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరికే సాధ్యమయ్యిందని అరకు వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త  పరిక్షిత్‌రాజు అన్నారు.  సాలూరులో జరిగిన బహిరంగ సభ కూడా ఒక పండగలా జరిగిందన్నారు. భారీ సంఖ్యలో గిరిజనులు స్వచ్ఛందంగా తరలివచ్చి  సభను విజయవంతం చేయడం పట్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ జగన్‌ పట్ల మొగ్గుచూపిస్తునట్లు తేటతెల్లమయ్యిందన్నారు. గిరిజనులు వైయస్‌ జగన్‌పై అభిమానం పెంచుకున్నారన్నారు. స్థానిక సమస్యలపై వైయస్‌ జగన్‌ ప్రస్తావించిన తీరు ఆకట్టుకుందన్నారు. గిరిజనులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గిరిజనులను గుర్తుచేసుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు, వైయస్‌ఆర్‌కు గల మధ్యతేడాను ప్రజలు గమనించారన్నారు. రాజన్నబిడ్డ వస్తే  మేలు జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top