అధైర్య ప‌డ‌కండి..జ‌గ‌న‌న్న వ‌స్తున్నారు





- బాబుకు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం
- తిత్లీ తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం
- ప్ర‌చారాల కోసం కోట్ల రూపాయ‌ల దుబారా
శ్రీ‌కాకుళం:  తిల్తీ తుపాను బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో వారం రోజుల్లో జిల్లాకు వ‌స్తున్నార‌ని, బాధితులు అదైర్య ప‌డొద్ద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ.. కేవలం ఆర్భాటాలు, ప్రచారాలకే ప్రాధాన్యమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని ఆయ‌న‌ విమ‌ర్శించారు.  మంగ‌ళ‌వారం  శ్రీ‌కాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌ర్య‌టించారు. దెబ్బ‌తిన్న పంట పొలాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ..తుపాను బీభత్సంతో ప్రజలు అల్లాడుతుంటే.. ఆ పరిస్థితులను కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకోవడం మానేసి, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ ..ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూనే కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. నష్ట పరిహారాల చెల్లింపులోనూ రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. అవసరానికి మించి నిధులను దుబారా చేయడంలో బాబు సిద్ధహస్తుడని విమర్శించారు. గతంలో సంభవించిన హుద్‌హుద్ తుపాన్‌ సమయంలోనే ఇది రుజువైందని, మళ్లీ ఇప్పుడు తిత్లీలో కూడా కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.  మరో వారం రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర జిల్లాకు చేరుకుంటుందని, ఆయన తిత్లీ బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని బాధితులకు ధైర్యం చెప్పారు.  



Back to Top