రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

వైయస్‌ఆర్‌ జిల్లా: రాజన్న రాజ్యం కావాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారి పల్లె మండలం చిన్నంపల్లి గ్రామంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. 
జగయ్యపేటలో..
జగ్గయ్యపేట పట్టణం 24వ వార్డులో వైయస్‌ఆర్‌ సీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు అవినీతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటూరి రాజ్‌గోపాల్, మాజీ చైర్మన్లు నాగేశ్వరరావు, ఎంవీ చలం, జగదీష్, ప్రసాద్‌ సుధారాణి పాల్గొన్నారు.
 
Back to Top