దాడి ఘ‌ట‌న‌పై నిష్ఫక్షపాతంగా వ్యవహరించండి

ఢిల్లీః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నంపై టీడీపీ  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించినట్లు వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలిపారు. దాడి ఘ‌ట‌న‌పై నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. చంద్రబాబు, పోలీసులు కలిసి హత్యాయత్నం కేసును నీరుగార్చే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను వైయస్‌ఆర్‌సీపీ బృందం వివరించినట్లు తెలిపారు.హత్యాయత్నంపై చంద్రబాబు,డిజీపీ, మంత్రులు వ్యాఖ్యలు తదితర అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు.  ఈ ఘటనపై ఎగతాళిగా మాట్లాడటం, మేం చేసి ఉంటే కైమా చేసేవాళ్లం అంటూ దారుణమైన పదజాలంతో టీడీపీ నేతలు మాట్లాడారన్నారు.ఇది మా పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను హోంమంత్రికి వివరించామన్నారు.తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారన్నారు. కేంద్రం ఈ ఘటనపై నిష్ఫక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నామని మేకపాటి తెలిపారు.
 

Back to Top