ఆంధ్రరాష్ట్రంలో అర్చకులకు భద్రత కరువు

పురోహితుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
రమణదీక్షితులు విధులపై కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు
వైయస్‌ జగన్‌తో చర్చించి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేలా చేస్తాం
అర్చకులపై దాడులు నివారించేందుకు కార్యచరణ 
విజయవాడ: భగవంతుడి సేవ చేసుకునే అర్చకులకు ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ కరువైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా దేవాదాయ, ధర్మాదాయ, హిందూ పరిరక్షణకు సంబంధించి ఎలాంటి చర్చలు కనిపించడం లేదన్నారు. పుష్కరాల పేరుతో వందల ఆలయాలను నేలమట్టం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న ఇలా ప్రధాన దేవాలయాల్లో వివాదాలకు ప్రభుత్వ అసమర్థతే ప్రధాన కారణమన్నారు. టీటీడీ ట్రస్టు బోర్డులో ఎలాంటి వారిని సభ్యులుగా నియమించారో ప్రజలంతా గమనించాలన్నారు. రమణ దీక్షితులుపై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిరంకుశ విధానానికి చెంపపెట్టు అన్నారు. దేవాలయ వ్యవస్థలో పనిచేసే అర్చకులు, పూజారుల పరిస్థితి బాబు హయాంలో దిగజారిపోయిందన్నారు. అర్చకులపై ప్రభుత్వ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. అర్చక వృత్తి సక్రమంగా జరగనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. 

ఏపీలో ఇప్పటి వరకు మహిళలపై దాడులు, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే కాకుండా కొత్తగా దేవాలయాల్లో పనిచేసే అర్చకుల ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. విశాఖపట్నం రామచంద్రాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే పురోహితుడు సెల్ఫీ వీడియో వాట్సాప్‌లో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా గుప్తు నిధుల తవ్వకాలకు సహకరించడం లేదని పూజా సామగ్రిని కొందరు బయటపడేస్తే అది తట్టుకోలేక విశాఖ జిల్లా కోరుకొండలోని ఓ దేవాలయంలోని మల్లికార్జున శర్మ అనే పురోహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం వీటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఐవైఆర్, రమణ దీక్షితులుపై వేధింపులు, అర్చకుల ఆత్మహత్యలు, దేవాలయాల్లో వివాదాలు, 
దీన్ని వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యచరణ రూపొందించుకొని దాడులను నివారించేందుకు ముందడు వేస్తామని అర్చకులకు భరోసానిచ్చారు.  
 
Back to Top