చంద్రబాబు నారా హమారా కాదు..నీరో చక్రవర్తి


- మీరిచ్చిన హామీల గురించి విద్యార్థులు ప్రస్తావిస్తే దాడులు చేయిస్తారా?
– ముస్లింల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
– బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

హైదరాబాద్‌: చంద్రబాబు నారా హమారా కాదని, నీరో చక్రవర్తి అని వైయస్‌ఆర్‌సీపీ మైనారిటీ నేత మహమ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు. నిన్న నారా హమారా సభలో చంద్రబాబు హామీలను ఫ్లకార్డ్సుద్వారా గుర్తు చేసిన విద్యార్థులను నల్లమాడ తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడారు. నిన్న గుంటూరులో నిర్వహించిన నారా హమారా–టీడీపీ హమారా కార్యక్రమంలో చంద్రబాబు టోపీ పెట్టుకొని ఈవెంట్‌ మేనేజర్‌లా వ్యవహరించారని విమర్శించారు. ఆ సభలో చంద్రబాబు చేసిన హామీలను గుర్తు చేస్తూ యువకులు ఫ్లకార్డ్సు పట్టుకొని గుర్తు చేస్తే..వారిని నిర్భందించి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికీ వారు నిర్భందంలోనే ఉన్నారన్నారు. యువకులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బకు టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిన్నటి సభలో ఆ యువకులు ఉర్దూ స్కూల్స్‌ సంగతి ఏమైంది, మదర్సాలకు ఉచిత బస్సు సౌకర్యం ఏమైందని ప్రశ్నించిన వారిపై దాడి చేయడం సిగ్గు చేటు అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే వేదికపైకి పిలిచి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు. నారా చంద్రబాబు నారా హమారా పోయి నీరో చక్రవర్తిగా మారారని అభివర్ణించారు. మీ వాగ్ధానాలకు గుర్తు చేసిన వారిని చిత్రహింసలకు గురి చేయడం బాధాకరమన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా నిరంకుశంగా వ్యవహరిండచం దారుణమన్నారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ చర్యలు ముస్లింల పట్ల చంద్రబాబు వైఖరికి అద్దం పడుతుందన్నారు. ముస్లింలపై టీడీపీకి ప్రేమ లేదని మరోమారు రుజువైందన్నారు. అదే కోపంతోనే ముస్లింలపై దాడి చేయించారన్నారు. ఉర్దూను సెకండ్‌ లాంగ్వేజీగా చేస్తామన్నారని, ముస్లింలపై చేతులు వేస్తే ఖబడ్ధార్‌ అన్న చంద్రబాబే పిల్లలపై చేయి చేసుకున్నారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా ముస్లింలకు ఏం చేశారో చెప్పకుండా, లేనివి విష బీజం నాటేలా వైయస్‌ఆర్‌సీపీ బీజô పీతో కలిసి పోతుందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు ఇలా మాపై అబంఢాలు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా ఏ పార్టీ  ఇస్తుందో ఆ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇస్తామని వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. ఏకైక సెక్యులర్‌ పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. గతంలో ఎన్‌డీఏలో ఉన్న చంద్రబాబు మోడీ ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని ఎందుకు డిమాండు చేయలేదని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీతో కలిస్తే మా కాలర్‌ పట్టుకోండి అని ధైర్యంగా చెప్పగలమని, మీరు ఇలా చెప్పే ధైర్యం ఉందా అని సవాల్‌ విసిరారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని, వారితో లాలూచీ పడమని స్పష్టమన్నారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ బీజేపీతో చంద్రబాబు కలిసి దొంగ నాటకాలు ఆడటం వాస్తవం కాదా అని నిలదీశారు. మోడీకి వంగి వంగి దండాలు పెట్టింది వాస్తవం కాదా అన్నారు. వైయస్‌ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు తప్ప..అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఆ కేసుల నుంచి వైయస్‌ జగన్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీబీఐలో పేరు లేకున్నా కూడా ఈడీ చార్జ్‌షీట్లో వైయస్‌ భారతమ్మ పేరు చేర్చారని, మేం బీజేపీతో కలిసి ఉంటే ఇది జరిగేదా అని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుందనే భయంతో టీడీపీని సైడ్‌కు పెట్టుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీ కలిసే ప్రసక్తే లేదని, ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని ఇక్బాల్‌ వివరించారు. 
 
Back to Top