ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు..

ఎన్టీఆర్‌ పేరును ఉచ్చరించే అర్హత కూడా చంద్రబాబుకు లేదు..
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీపార్వతి నిరసన...
హైదరాబాద్ః టీడీపీ,కాంగ్రెస్‌ పొత్తుతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి అన్నారు.  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆమె నిరసన చేపట్టారు.లేఖ రాసి ఎన్టీఆర్‌ సమాధి వద్ద పెట్టారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పోడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవంతో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, తన స్వార్థం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారన్నారు. ఎన్నికల్లో ఎన్టీఆర్‌ పేరు,ఫొటో పెట్టుకునే అర్హత టీడీపీ కోల్పోయిందన్నారు.ఎన్టీఆర్‌ పేరును ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

ఇటీవ‌ల ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో చంద్రబాబు సమావేశం కావడం, ఇరు పార్టీలు వైరుధ్యాలను మరచి జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తామని ప్రకటించడం కాంగ్రెస్‌ కేడర్‌తోపాటు నాయకుల్లోనూ గుబులు రేపుతోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top