వైయస్‌ జగన్‌ హత్యాయత్నంలో కుట్ర కోణం

ప్రభుత్వం బాధ్యత వహించాలి
వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు
కాకినాడః రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికొదిలి టీడీపీ ప్రభుత్వం కేవలం అవసరాల కోసం పోలీçసు వ్యవస్థ ఉపయోగించుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. వైయస్‌ జగన్‌పై  హత్యాయత్నం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ ఓర్వలేనితనం ప్రదర్శిస్తుందని విమర్శించారు.పోలీసు వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు..దీని వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్నామన్నారు.ఒక చిన్నగాయంగా భావించడానికి వీలులేదని, సీరియస్‌ తీసుకోవాలన్నారు. కోడిపందాలకు వాడే కత్తిని ఒక వెయిటర్‌ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా తీసుకొచ్చాడు.కోడిపందాల వాడే కత్తికి విషం,పాదరసం పూసి పెద్దపెద్ద హత్యలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చరిత్ర చెబుతుందన్నారు. దీని వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారనే అనుమానం కలుగుతుందని తేలికగా తీసుకోవడానికి వీలులేదన్నారు.ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు రక్షణలేకుండా పోయిందన్నారు.

Back to Top