వైయస్‌ జగన్‌పైనే పేదల ఆశలు

తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ ధనార్జనే తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు అన్నారు. వేల కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కొండేటి చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను పి.గన్నవరం నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేశారన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు మోసాలతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు వైయస్‌ జగన్‌కు ముఖ్యమంత్రి పట్టం కట్టాలని ఎదురుచూస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామన్నారు. చదువుకున్న నిరుద్యోగులు వేల సంఖ్యలో ఉన్నారని, ఉద్యోగ అవకాశాలు లేక కూలి పనులకు వెళ్తున్నారన్నారు. పేద ప్రజల కష్టాలు టీడీపీకి పట్టవా అని ప్రశ్నించారు. పేద ప్రజలు కేవలం వైయస్‌ జగన్‌పై ఆశలు పెట్టుకున్నారన్నారు. రానున్నరోజుల్లో టీడీపీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. 
Back to Top