వైయస్‌ఆర్‌సీపీ నేత కేశవరెడ్డి హత్య

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ ఆత్మకూరు నాయకులు కేశవరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. కేశవరెడ్డిపై రాడ్‌లతో దాడి చేసి హతమార్చారు. కొనప్రాణాలతో ఉన్న కేశవరెడ్డిని ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పరిటాల కుటుంబం హత్య చేయించిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల మధ్య పాతకక్షలను ఆసరాగా చేసుకున్న పరిటాల వర్గీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడుతున్నారు.
 
Back to Top