మృతుల కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల పరామర్శ..

తూర్పుగోదావరిః  కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి మట్టి మాఫియానే కారణమని వైయస్‌ఆర్‌సీపీ నేత కురుసాల కన్నబాబు అన్నారు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  మట్టి మాఫియా వెనుక పిఠాపురం ఎమ్మెల్యే వర్మ సోదరుడు ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయన్నారు. పోలవరం ఎడమ కాల్వ మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారన్నారు.  రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు.
 
Back to Top