స్వార్థ ప్రయోజనాలు కోసం ఏపీని నాశనం చేస్తావా..

హైకోర్టు,సుప్రీంకోర్టులపైనే ఆరోపణలా...
చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత సి.రామచంద్రయ్య ఫైర్‌..
హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసు కారణంగా ఏపీ ఎకానమీ మొత్తం చంద్రబాబు నాశనం చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు.హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు  హైదరాబాద్‌లో  ఉండే అవకాశం ఉన్నా కూడా ఓటుకు నోటు కేసుకు భయపడి..స్వార్థ ప్రయోజనాలు కోసం అర్ధరాత్రి అమరావతికి తరలించారని దుయ్యబట్టారు.సౌకర్యాలు లేని  రాజధానికి తరలించి ఉద్యోగులను,అధికారులను ఇబ్బందులు పెట్టారన్నారు. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు మాత్రం దర్జా వెలగబెడుతున్నారన్నారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టుకున్నారన్నారని, చంద్రబాబు  నిబంధనలు అతిక్రమిస్తే ఏ అధికారి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అప్పటికప్పుడు రాజధానికి తరలించి చంద్రబాబు ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయిందన్నారు. రాష్ట్ర విభజన చేయమని లేఖ ఇచ్చి అన్యాయం జరిగిందని బాబు అన్నారని, హైకోర్టు విషయంలోనూ అంతే చేశారన్నారు. న్యాయ వ్యవస్థను అవమానిస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టసభను,న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ అర్హతతో ఇష్టం వచ్చినట్లు  మాట్లాడుతున్నాడని, రాజ్యాంగానికి చంద్రబాబు అతీతుడు కాదని దుయ్యబట్టారు. అనుకూల మీడియా ఉంది కాదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లందన్నారు. హైకోర్టు,సుప్రీంకోర్టు కుట్ర చేశాయని చంద్రబాబు అర్థంపర్థం లేకుండా మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  రాష్ట్రమే విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు విభజన జరగకుండా ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. న్యాయ స్థానాలకు దురేద్దేశ్యాలను  ఆపాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే అని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top