<img src="/filemanager/php/../files/untitled folder/botsa (1).jpg" style="width:600px;height:450px"><br>అమరావతి: ఢిల్లీలో ఏర్పడే కొత్త కూటమిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరదని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎన్ని కూటములు వచ్చిన ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదన్నారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిని కూడా చంద్రబాబు తన అవసరాల కోసమే వాడుకుంటున్నారన్నారు.