వెలుగొండ పూర్తి కావాలంటే జగనన్న సీఎం కావాలి


ప్రకాశం:  వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జి ల్లాను సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. మహానేత మర ణాంతరం ఈ ప్రాజెక్టు గురించి  ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల చంద్రబాబు జిల్లాకు వచ్చి వెలుగొండ ప్రారంభించింది నేనే, పూర్తి చేసేది నేనే అని చెప్పడం సిగ్గు చేటు  అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో వెలుగొండ ప్రాజెక్టుతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు నిర్మించార న్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లాకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నాయకులకు నీరు–చెట్టు కార్యక్రమంతో దోచి పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అత్యధిక మెజారిటీతో గెలిపించి, జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. 
 
Back to Top