వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలరాజు..శ్రీకాకుళంఃఅన్నివర్గాల ప్రజలు వైయస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని పలాస వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలరాజు అన్నారు.గడచిన నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలకు కూడా కల్పించడంలేదన్నారు.రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం పలాస అని అన్నారు. అనేక వనరులున్నా అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న 60 సంవత్సరాల కుటుంబ పాలనలో అభివృద్ధి సున్నా అని తెలిపారు. చెప్పుకోవడానికి కనీసం ఒక ప్రాజెక్టును కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఉద్ధానంలో ఎక్కడా లేని శాపంగా కిడ్నీ వ్యాధులు ప్రాణాలు హరించుపోతున్నా,గిరిజనులు బతుకులు అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోలేదన్నారు.పలాస పారిశ్రామికంగా ఎదుగుబొదుకు లేని పరిస్థితిలో ఉందన్నారు.అపారమైన వనరులు, జలాశయాలు ఉన్నా పాలకులు పట్టించుకోవడంలేదన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని, జననేత అధికారం చేపట్టితే అన్ని సమస్యలు పరిష్కారం కావడంతో పాటు రాష్ట్రం పురోగతి సాధిస్తుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.<br/>