బాబుకు మతిస్థిమితం ఉందా?

 
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో గెలుస్తుందని, ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఓడిపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు పేర్కొనడం దుర్మార్గమన్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా కూలి కింద ఓట్లు వేయాలని పేర్కొనడం బాధాకరమన్నారు.  జనవరి 1వ తేదీన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించి.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు మాత్రం టీటీడీ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించవచ్చా అని ప్రశ్నించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top