వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళ‌ల‌పై ప‌చ్చ‌మూక‌ల దాడి

క‌ర్నూలు జిల్లా తుగ్గ‌లిలో రెచ్చిపోయిన టీడీపీ నాయ‌కులు

క‌ర్నూలు:   రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంది. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ ఉప్పాల హారిక‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలు జిల్లాలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. క‌ర్నూలు జిల్లా తుగ్గ‌లి మండ‌లంలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రులైన మ‌హిళ‌ల‌పై టీడీపీ గూండాలు క‌ర్ర‌ల‌తో దాడికి తెగ‌బ‌డ్డారు. తుగ్గలి మండలం, జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శభాష్ పురం గ్రామంలో సోమవారం ఉదయం వైయ‌స్ఆర్‌సీపీకి  చెందిన మహిళలపై టిడిపి నాయకులు దాడులు చేశారు. అయితే పోలీసులు అధికార పార్టీ నేత‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవడం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నగేష్ యాదవ్, మండల కన్వీనర్ అట్లా గోపాల్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాయ‌కులు మాట్లాడుతూ.. మొహరం సందర్భంగా గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త తన  ఇంటి వద్ద మొహరం వేడుకలకు మేళం పాడేందుకు వచ్చిన కొత్త బురుజు  గ్రామానికి చెందిన వ్యక్తికి అన్నం పెడుతుండగా టీడీపీ నాయకులు అనవసరంగా జోక్యం చేసుకొని వైయ‌స్ఆర్‌సీపీ మహిళలపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై బందోబస్తులో ఉన్న పోలీసుల వద్దకు ఫిర్యాదు చేసేందుకు  వ‌చ్చిన వారిపై కూడా దాడులు చేయడంతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు గ్రామం వదిలి పారిపోయారని తెలిపారు.  దాడులు చేసిన టిడిపి వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చ‌రించారు. 

Back to Top