<br/>విజయవాడ: చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ అన్నారు. బాబు పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు రైతుల రుణమాఫీ చేస్తానని చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారన్నారు.