లోక్ సభలో వైయస్సార్సీపీ వాయిదా తీర్మానం నోటీస్

న్యూఢిల్లీః ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది.  పార్టీ ఎంపీలు హోదాపై చర్చకు పట్టబట్టనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా వైయస్సార్సీపీ ఆది నుంచి ముందువరుసలో ఉండి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.  పార్లమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని వైయస్సార్సీపీ రెండేళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తోంది. 

చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.  హోదాను విస్మరించిన టీడీపీ, బీజేపీల దుర్మార్గకు వైఖరిని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top