రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు..!నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్సీపీ పోరాటం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు పార్టీశ్రేణులు హోదాపై గర్జిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రిలేదీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
కొనసాగుతున్న నిరసనల పర్వం..!ఈనెల 17 నుంచి 21వరకు వైఎస్సార్సీపీ దశలవారీగా తన పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 17 నుంచి అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. 21వరకు దీక్షలు కొనసాగుతాయి. అదేవిధంగా ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ 18న పెద్ద ఎత్తున పార్టీనేతలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. 19న ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేపట్టారు. 20న కొవ్వొత్తుల ప్రదర్శనతో ప్రజల పక్షాన ప్రత్యేకహోదా కోసం నినదిస్తున్నారు.
సర్వత్రా ఉత్కంఠ..!ఈనెల 22న ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ... ప్రత్యేకహోదాను సాధించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. నరేంద్రమోడీ చేత హోదా ప్రకటన చేయించాలని కోరుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధాని అపాయిట్ మెంట్ కూడా కోరారు.